భారత్, పాక్ మధ్య ఇటీవల జరిగిన చర్చల పట్ల చైనా ఆనందంగా ఉందని ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది. ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి ఇది మరింత దోహదపడుతుందని పేర్కొంది. పాక్తో తాము కలిసి పనిచేయాలని భావిస్తున్నట్టు ఆ దేశం వెల్లడించింది.
కశ్మీర్, ఇతర సెక్టార్లలో నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందంపై భారత్-పాక్ మధ్య ఫిబ్రవరి 25న చర్చలు జరిగాయి. ఒప్పందాన్ని చిత్తశుద్ధితో అమలు చేసేందుకు ఇరు దేశాలూ అంగీకరిస్తున్నట్టు ప్రకటించాయి.
పాక్తో కలిసి ముందుకు..
ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరడంపై చైనా హర్షం వ్యక్తం చేసింది. ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, అభివృద్ధి కోసం.. పాక్తో కలిసి పనిచేయాలనుకుంటున్నట్టు ఆ విదేశాంగ మంత్రి ఝావ్ లిజియన్ తెలిపారు. ఈ సందర్భంగా.. మార్చి 25 పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి చేసిన ప్రసంగం(చైనా తమ దేశానికి అత్యంత సన్నిహిత, స్వేహపూర్వక దేశం)పై స్పందించారు. అల్వి వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామన్నారు. అంతేకాకుండా.. పాకిస్థాన్ 82వ జాతీయ దినోత్సవం సందర్భంగా.. ఆత్మీయ అభినందనలు తెలిపింది బీజింగ్ ప్రభుత్వం.
కరోనాపై పోరులో అండ
కరోనాపై పోరాడేందుకు పాక్తో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని లిజియన్ తెలిపారు. దౌత్య సంబంధాల 70వ వార్షికోత్సవం ఇందుకు చక్కటి అవకాశంగా భావిస్తున్నట్టు చెప్పారు. పాక్తో తమ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడం సహా.. చైనా-పాక్ మధ్య మిత్ర బంధాన్ని ముందుకు తీసుకెళ్తామని ఉద్ఘాటించారు.
ఇదీ చదవండి:నీటిలోకి 'ఎవర్ గివెన్' ముందు భాగం!