కొత్తరకానికి చెందిన కరోనా వైరస్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. మెరుపు వేగంతో పంజా విసురుతోన్న కరోనాను కట్టడి చేసేందుకు చైనా ప్రభుత్వం గట్టి చర్యలు చేపడుతోంది.
ఈ వైరస్‌కు కేంద్ర బిందువుగా భావిస్తోన్న వుహాన్ నగరానికి విమాన, రైలు సర్వీసులను ప్రభుత్వం రద్దు చేసింది. ప్రత్యేక కారణం లేకుండా స్థానికులు బయటికి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది.
పొంచి ఉన్న ముప్పు...
ఈ నెల 24 నుంచి వారం రోజుల పాటు చైనాలో నూతన సంవత్సర సెలవులు రానున్నాయి. ఆ సమయంలో లక్షల మంది చేసే ప్రయాణాలతో వ్యాధి తీవ్రత మరింత పెరుగుతుందని భయపడుతున్నారు అధికారులు. ఏటా ఈ సెలవుల సమయంలో రైళ్లు, రోడ్డు మార్గాలు కిక్కిరిసిపోతుంటాయి. విమానాలకు తాకిడి గరిష్ఠంగా ఉంటుంది.