చైనా ప్రభుత్వం మరో టీకాకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే సినోఫార్మ్ టీకాకు షరతులతో కూడిన అనుమతులు జారీ చేయగా.. తాజాగా సినోవాక్ టీకాకు అదే విధంగా అంగీకారం తెలిపింది. ఈ అనుమతితో వ్యాక్సిన్‌ను ఇప్పుడు ప్రజలకు అందించవచ్చు. ఈ విషయాన్ని నేషనల్ మెడికల్ ప్రొడక్ట్స్ అడ్మినిస్ట్రేషన్ శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.
సినోవాక్ బయోటెక్ రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ను ఇప్పటికే పది దేశాలు కొనుగోలు చేశాయి. మరో ఐదు దేశాల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. గతేడాది జూలైలో వచ్చిన ఈ టీకాను ఇప్పటివరకు కేవలం వైద్యారోగ్య సిబ్బంది, అధికారులకు మాత్రమే అందుబాటులో ఉంచారు.
సినోవాక్‌ను కూడా సినోఫార్మ్లాగే రెండు డోసుల కింద అందిస్తారు. ఫైజర్ టీకాతో పోలిస్తే ఈ రెండు వ్యాక్సిన్లను భద్రపరచడం సులభం. కనిష్ఠ ఉష్ణోగ్రతల అవసరం లేదు. వనరులు తక్కువ ఉండే అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇవి మరింత ఉపయోగకరం.
అయితే సినోవాక్ పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్ సామర్థ్యంపై ఆ సంస్థ చేస్తున్న ప్రకటనలే ఇందుకు కారణం. టర్కీలో క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ఈ టీకా ప్రభావం 91.25 శాతం ఉంటుందని ప్రకటించగా.. బ్రెజిల్ పరీక్షల్లో ఇది 78శాతం అని పేర్కొన్నారు. అనంతరం దుష్ప్రభావాల కారణంగా 50శాతానికి కుదించారు.
ఇదీ చదవండి :1.9 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీకి సెనెట్ ఆమోదం