చైనాలో ఇటీవల సంభవించిన వరదల్లో 302 మంది మరణించారని అక్కడి అధికారులు తెలిపారు. 50 మంది ఆచూకీ ఇంకా లభించలేదని వెల్లడించారు. బాధితుల్లో ఎక్కువ మంది ఝెంగ్జౌ నగరానికి చెందినవారే ఉన్నారు. ఈ నగరంలో 292 మంది ప్రాణాలు కోల్పోగా.. 47 మంది గల్లంతయ్యారు. ఇతర నగరాల్లో 10 మంది మరణించారు.
వరదల ధాటికి చైనాలో 302 మంది మృతి - చైనా వరదలు 2021
చైనాలో వరదల ప్రభావానికి మరణించిన సంఖ్య 302కు చేరిందని అధికారులు వెల్లడించారు. 50 మంది ఆచూకీ కోల్పోయారని తెలిపారు. ఒక్క ఝెంగ్జౌ నగరంలోనే 292 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.
చైనా వరదలు
జులై 17 నుంచి చైనాలో భారీ వర్షాలు కురిస్తున్నాయి. వందల ఏళ్ల రికార్డులను తిరగరాస్తూ కుండపోత వర్షాలు పడుతున్నాయి. ఒక్క హెనన్ రాష్ట్రంలోనే 30 లక్షల మందిపై వరద ప్రభావం పడినట్లు అక్కడి అధికారులు తెలిపారు. సుమారు 3.76 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు. మొత్తం మీద 10 బిలియన్ డాలర్ల మేర ఆర్థికంగా నష్టం వాటిల్లినట్లు చైనీస్ మీడియా తెలిపింది.
ఇదీ చదవండి: