స్వయం పాలిత తైవాన్ పట్ల చైనా దురహంకార ధోరణి కొనసాగుతోంది. తైవాన్ గగనతలంలోకి ఆ దేశం సోమవారం 52 యుద్ధ విమానాలను పంపించి (China Taiwan fighter planes) కవ్వించింది. వాటిలో 34 జె-16 యుద్ధ విమానాలు, 12 హెచ్-6 బాంబర్లు ఉన్నాయి. తైవాన్ ఎయిర్‌ఫోర్స్ చైనా జెట్ల కదలికలను పరిశీలించిందని జాతీయ రక్షణ శాఖ వెల్లడించింది. (China warplanes Taiwan)
గత శుక్రవారం నుంచి చైనా ఇదే తరహాలో తైవాన్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. చైనా జాతీయ దినోత్సవమైన శుక్రవారం 38, శనివారం 39, ఆదివారం 16 యుద్ధవిమానాలను తైవాన్ మీదకు పురమాయించింది. ఇంత భారీ సంఖ్యలో యుద్ధవిమానాలను తైవాన్ గగనతలంలోకి పంపించడం ఇదే తొలిసారి. (China warplanes Taiwan)