తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా డేటాపై అమెరికా ఆరోపణలను తిప్పికొట్టిన చైనా - అమెరికా జాతీయ సలహాదారును తప్పుపట్టిన చైనా

కరోనా డేటా షేరింగ్ అంశంపై అగ్రరాజ్యం చేసిన ఆరోపణలను చైనా తిప్పికొట్టింది. డబ్ల్యూహెచ్​ఓ శాస్త్రవేత్తలు కరోనా మూలాలు కనిపెట్టేందుకు వూహాన్​ వెళ్లగా.. చైనా అందుకు సహకరించలేదని అమెరికా భద్రతా సలహాదారు జాక్ సలివన్ అసహనం వ్యక్తం చేశారు.

China fires back at US allegations of lack of transparency
కరోనా డేటా షేరింగ్: అమెరికాపై చైనా ఆగ్రహం

By

Published : Feb 15, 2021, 6:55 AM IST

డబ్ల్యూహెచ్​ఓతో కరోనా వైరస్ సమాచారాన్ని​పంచుకునే విషయంలో అమెరికా చేసిన ఆరోపణలను చైనా తిప్పికొట్టింది. 'కొవిడ్​-19 విషయంలో అంతర్జాతీయ సహకారాన్ని అమెరికా ఇప్పటికే దెబ్బతీసింది. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థకు నమ్మకంగా మద్దతిస్తోన్న దేశాలవైపు వేలెత్తి చూపుతోంద'ని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు వాషింగ్టన్​లోని చైనా రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

అమెరికా తిరిగి డబ్ల్యూహెచ్​ఓలో చేరటంపై హర్షం వ్యక్తం చేసింది. డబ్ల్యూహెచ్​ఓకు సహకారం అందించటంలో ఉన్నత విలువలు, బాధ్యతాయుతంగా, పారదర్శకతతో వ్యవహరిస్తుందనే నమ్మకం ఉన్నట్లు తెలిపింది.

తొలుత డేటా షేరింగ్​ విషయంలో చైనా సహకరించడంలేదంటూ.. కరోనా ఆవిర్భావం గురించి తెలుసుకునేందుకు వూహాన్​ వెళ్లిన డబ్ల్యూహెచ్​ఓ శాస్త్రేవేత్తలు తెలిపారు. ఈ ఆరోపణలను సమర్థిస్తూ చైనా వైఖరిపై శనివారం మండిపడింది అమెరికా.

'కరోనా మూలాలు కనిపెట్టేందుకు చేస్తోన్న పరిశోధనకు సంబంధించిన నివేదిక స్వతంత్రంగా ఉండాలి. ఈ విషయంలో చైనా జోక్యం చేసుకోకపోవడం మంచిది' అని జాతీయ భద్రతా సలహాదారు జాక్ సలివన్ అన్నారు. రానున్న పరిణామాల దృష్ట్యా చైనా.. కరోనా వైరస్​కు సంబంధించిన వివరాలను పంచుకోవాలని తెలిపారు. చైనా వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:చైనాలో స్ప్రింగ్​ ఫెస్టివల్​- వీధులన్నీ కలర్​ఫుల్​

ABOUT THE AUTHOR

...view details