అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై చైనా ఎట్టకేలకు స్పందించింది. విజేతగా నిలిచిన జో బైడెన్, కమలా హారిస్‌లకు అభినందనలు తెలిపింది. అమెరికా ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొంది.
"అమెరికా ఎన్నికలపై ఆ దేశంతో పాటు అంతర్జాతీయంగా వచ్చిన స్పందనలను గమనిస్తున్నాం. అమెరికా ప్రజల నిర్ణయాన్ని మేం గౌరవిస్తున్నాం. బైడెన్, హారిస్‌లకు అభినందనలు తెలుపుతున్నాం. అమెరికా చట్టాలు, విధి విధానాలు అనుసరించి అధ్యక్ష ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తారని మేం అర్థం చేసుకున్నాం."
-వాంగ్ వెన్బిన్, చైనా విదేశాంగ ప్రతినిధి
అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ఎన్నికవడాన్ని స్వాగతించారు వెంగ్బిన్. ప్రపంచంలోని మహిళల అభివృద్ధికి చైనా కట్టుబడి ఉందన్నారు. మహిళలకు పురుషులతో సమాన హోదా ఉండాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఐరాసలో చేసిన వ్యాఖ్యలను పాత్రికేయులు ప్రస్తావించగా ఇలా స్పందించారు.