తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనా సర్కారుపై ఆ దేశ సైనికుల కుటుంబాల ఆగ్రహం - soldiers killed in Galwan face-off

గల్వాన్​ లోయ ఘటన నేపథ్యంలో సొంత ప్రజల నుంచే చైనా ప్రభుత్వానికి వ్యతిరేకత ఎదురవుతోందని అమెరికా వార్తా సంస్థ నివేదించింది. ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల వివరాలు బయటపెట్టకపోవడమే ఇందుకు కారణంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో సైనికుల కుటుంబ సభ్యులు.. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం, అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్టు స్పష్టం చేసింది.

జవాన్ల కుటుంబాలను శాంతిపజేయడానికి చైనా అష్టకష్టాలు
China failing to silence upset families of soldiers killed in Galwan face-off

By

Published : Jun 28, 2020, 5:43 PM IST

గల్వాన్​ ఘటనలో మరణించిన సైనికుల వివరాలను చైనా ప్రభుత్వం ఇప్పటికీ బయటపెట్టలేదు. పలువురు మృతిచెందారని ఓ ప్రకటన విడుదల చేసిందే తప్ప.. ఇప్పటి వరకు ఎలాంటి వివరాలను వెల్లడించలేదు చైనా కమ్యూనిస్ట్​ పార్టీ. ఈ విషయంపై సొంత ప్రజల నుంచే ప్రభుత్వానికి వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన బ్రియట్​బార్ట్​ న్యూస్​ నివేదించింది.

నివేదిక ప్రకారం.. ఘర్షణలో మరణించిన చైనా సైనికుల కుటుంబాలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. తమ వారికి తగిన గౌరవం దక్కలేదని ఆరోపిస్తున్నాయి. ఈ విషయంపై వైబో సహా ఇతర సామాజిక మాధ్యల ద్వారా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాయి. వారిని శాంతిపజేయడానికి చైనా ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. అయినా ఫలితం దక్కడం లేదు.

చైనా దుస్సాహసం..

మే నెల నుంచి భారత్​-చైనా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పరిస్థితిని అదుపుచేయడానికి సమస్యాత్మక ప్రాంతాల నుంచి సైనికులను వెనక్కి రప్పించాలని ఇరు దేశాల నిర్ణయించాయి. అయితే చైనీయులు మాత్రం ఈ నెల 15న గల్వాల్​ లోయలో భారత జవాన్లపై దుస్సాహసానికి పాల్పడ్డారు. ఈ వార్త బయటకు వచ్చిన కొద్ది గంటల్లోనే.. 20మంది భారత జవాన్లు వీరమరణం పొందినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆయా రాష్ట్రాల్లో ఆ 20మందికి ఘనంగా వీడ్కోలు పలికారు ప్రజలు. కానీ చైనా మాత్రం.. మరణించిన తమ జవాన్ల వివరాలను వెల్లడించలేదు. అయితే గల్వాన్​ ఘటనలో చైనావైపు 43మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని భారత్ అం​చనా వేస్తోంది.

ఇదీ చూడండి:-సరిహద్దులో యుద్ధ మేఘాలు- క్షిపణులు మోహరిస్తున్న భారత్!

ABOUT THE AUTHOR

...view details