సరిహద్దులో ప్రతిష్టంభన కొనసాగుతున్న సమయంలో భారత్‌ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్ వెన్బిన్. లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని చైనా గుర్తించదని పేర్కొన్నారు. 'భారత్ అక్రమంగా ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని ఆమోదించేది లేదు' అని వ్యాఖ్యానించారు. సైనిక అవసరాల కోసం సరిహద్దులోని వివాదాస్పద ప్రాంతాల్లో భారత్ నిర్మాణాలు చేపట్టడాన్ని వ్యతిరేకించారు.
వాంగ్ వెన్బిన్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ చైనా ప్రభుత్వ అనుబంధ వార్తా సంస్థ-గ్లోబల్ టైమ్స్ కథనం ప్రచురించింది. ఇరుదేశాల మధ్య ఇటీవల కుదిరిన ఒప్పందాల ప్రకారం పరిస్థితిని తీవ్రతరం చేసే చర్యలు చేపట్టవద్దని వెన్బిన్ పేర్కొన్నట్లు పత్రిక తెలిపింది.