ఊహించినదానికంటే వేగంగా ప్రస్తుతం చైనా తన అణ్వాయుధ సంపత్తిని(China Nuclear Weapons) పెంచుకుంటోందని అమెరికా రక్షణ శాఖ(Pentagon Report On China 2021) తాజాగా ఓ నివేదికలో పేర్కొంది. అయితే దీన్ని డ్రాగన్ తీవ్రంగా ఖండించింది. పూర్తి పక్షపాత ధోరణితో నివేదికను(Pentagon Report On China 2021) రూపొందించినట్లు తిప్పికొట్టింది. పైగా ఈ వ్యవహారాన్ని పెద్దదిగా చేసి చూపెడుతోందని చైనా ఆరోపించింది. చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ ఈ మేరకు స్పందించారు.
"గతంలోనూ అమెరికా విడుదల చేసిన ఆయా నివేదికల(Pentagon Report On China 2021) మాదిరిగానే ఇది కూడా వాస్తవాలను విస్మరించింది. చైనా అణు ముప్పు గురించి ప్రచారం చేసేందుకు ఈ నివేదికను ఉపయోగించుకుంటోంది. ప్రపంచంలో అణు ముప్పునకు అమెరికానే అతిపెద్ద మూలం."