తెలంగాణ

telangana

ETV Bharat / international

'ట్రంప్ వాదన తప్పు... కరోనా బాధ్యత వారిదే' - కరోనా వైరస్ చైనాలో పుట్టిందా?

కరోనా వ్యాప్తికి చైనానే కారణమంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలను చైనా తోసిపుచ్చింది. 10 ట్రిలియన్ డాలర్ల పరిహారాన్ని డిమాండ్ చేయడాన్ని తప్పుపట్టింది. ప్రజారోగ్యాన్ని విస్మరించిన రాజకీయ నాయకులే దీనికి జవాబుదారీగా ఉండాలని వ్యాఖ్యానించింది.

Wang Wenbin
చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్ వెన్​బిన్

By

Published : Jun 7, 2021, 8:18 PM IST

కొవిడ్-19 వల్ల కలిగిన విధ్వంసం, సంభవించిన మరణాలకు బాధ్యత వహిస్తూ అమెరికా సహా.. ప్రపంచానికి 10 ట్రిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన డిమాండ్‌ను చైనా సోమవారం తిరస్కరించింది. ఈ మేరకు స్పందించిన చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్ వెన్​బిన్.. ట్రంప్​ అధికారంలో ఉన్న సమయంలో అమెరికాలో 2.4 కోట్ల కరోనా కేసులు.. 4,10,000 మరణాలు నమోదయ్యాయని పేర్కొన్నారు.

"వాస్తవాలను ట్రంప్ విస్మరించారు. కరోనాను ఎదుర్కొనేందుకు ఆయన సత్వరమే స్పందించలేదు. కొవిడ్ కట్టడిలో పదేపదే విఫలమయ్యారు. ప్రజా దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నించారు. అమెరికన్ ప్రజలు న్యాయమైన తీర్పు ఇచ్చారని చైనా బలంగా నమ్ముతోంది. ప్రజల జీవితాలను, ఆరోగ్యాన్ని విస్మరించిన కపట రాజకీయ నాయకులే మహమ్మారి విలయానికి జవాబుదారీగా ఉండాలి."

-వాంగ్ వెన్​బిన్

ఇదీ చదవండి:Trump: చైనా మూల్యం చెల్లించాల్సిందే

ఇదీ చదవండి:'మహమ్మారి మూలాలను తెలుసుకోవాలి'

ఆది నుంచీ ట్రంప్​ది అదే వాదన..

శనివారం నార్త్ కరోలినాలో జరిగిన రిపబ్లికన్ పార్టీ సమావేశంలో ట్రంప్ మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావించారు. కరోనాను 'చైనా వైరస్', 'వుహాన్ వైరస్' అని పేర్కొంటూ.. చైనా భారీగా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తాను అధ్యక్షునిగా ఉన్న సమయంలో.. వుహాన్ ల్యాబ్​ నుంచే కరోనా వైరస్ లీక్ అయిందని ట్రంప్ ఆరోపించారు. అంతేగాక చైనాకు మద్దతు ఇస్తోందని ఆరోపిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచీ వైదొలిగారు.

'మనలో చాలా మంది కరోనా అనేది సహజంగా ఏర్పడినదేనని భావిస్తున్నాం. కానీ ఎవరికీ దీనిగురించి 100 శాతం సమాచారం లేదు. దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అమెరికా అంటువ్యాదుల చికిత్స నిపుణులు ఆంటోని ఫౌచీ తెలిపారు.

కరోనా మూలాలను కనుగొనేందుకు ఈ ఏడాది మొదట్లో డబ్ల్యూహెచ్​ఓ బృందం వుహాన్ ల్యాబ్​ను సందర్శించింది. అయితే చైనా మాత్రం తమ దేశంలో కరోనా పుట్టిందన్న ఆరోపణలను ఖండిస్తూ వస్తోంది.

ఇవీ చదవండి:వుహాన్​ ల్యాబ్​ గుట్టు ఫౌచీకి నిజంగానే తెలియదా?

గత వందేళ్లలో ఇదే అతిపెద్ద మహమ్మారి

ABOUT THE AUTHOR

...view details