తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా సమాచారాన్ని మేం దాచిపెట్టలేదు: చైనా - Tedros Adhanom

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ కరోనా వైరస్​ వ్యాప్తికి చైనా కేంద్రమని ఆరోపించడాన్ని.. ఆ దేశం తీవ్రంగా ఖండించింది. కరోనా వ్యాప్తిపై ప్రాథమిక సమాచారాన్ని నివేదించడంలో ఎలాంటి దాపరికలు లేవని చైనా స్పష్టం చేసింది.

China denies cover-up of COVID-19 info; defends WHO chief
'కరోనా వ్యాప్తి సమాచారాన్ని దాచిపెట్టలేదు'

By

Published : Apr 10, 2020, 6:47 AM IST

'డబ్ల్యూహెచ్​ఓ అధ్యక్షుడు టెడ్రోస్ అధనామ్​ సహకారంతో కరోనా వైరస్​ వ్యాప్తి సమాచారం నివేదించడంలో చైనా ఆలస్యం చేసిందని.. వుహాన్ కేంద్రంగా వైరస్​ వ్యాప్తి చెందిందని' అమెరికా చేసిన ఆరోపణలను చైనా తీవ్రంగా ఖండించింది.

అంటువ్యాధులు ఎక్కడైనా..

కొవిడ్​-19 గురించి డబ్ల్యూహెచ్​ఓకు తొలుత నివేదించినంత మాత్రాన వైరస్​ వుహాన్​లో ఉద్భవించినట్లు కాదని చైనా విదేశాంగ ప్రతినిధి ఝా లిజియన్​ అన్నారు. కరోనా సమాచారాన్ని చైనా దాచి ఉంచిందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ ​పాంపియో చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. అంటువ్యాధులు ప్రపంచంలో ఎక్కడైనా ఉద్భవించవచ్చని.. జీవుల పుట్టుక సైన్సుకు సంబంధించిందని ఝా వ్యాఖ్యానించారు.

'కరోనా సమాచారాన్ని స్థానిక అధికారులు దాచి పెట్టడం వల్ల ప్రాథమిక స్థాయిలో వైరస్ వ్యాప్తి చెందింది. దాని గురించి పూర్తిగా తెలియదు. ఇలాంటి సందర్భంలో సమాచారం దాచి ఉంచామని ఎలా ఆరోపిస్తారని ప్రశ్నించారు ఝా.

ABOUT THE AUTHOR

...view details