తెలంగాణ

telangana

ETV Bharat / international

'సైనికుల అంత్యక్రియలకు చైనా నో అందుకే' - India china standoff

గల్వాన్​ ఘర్షణలో మృతి చెందిన సైనికుల వివరాలు చైనా వెల్లడించకపోవటంపై కీలక విషయాలు బయటపెట్టింది అమెరికా. సైనికుల అంత్యక్రియలను సంప్రదాయం ప్రకారం చేయొద్దని వారి కుటుంబాలపై ఒత్తిడి చేస్తోందని పేర్కొంది. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికే సైనికుల మరణాలను అంగీకరించటం లేదని ఆరోపించింది.

China denies burial to its soldiers killed in Galwan
'అందుకే సైనికుల అంత్యక్రియలను చైనా అడ్డుకుంటోంది'

By

Published : Jul 14, 2020, 1:10 PM IST

గల్వాన్‌ ఘర్షణలో మృతిచెందిన సైనికుల అంత్యక్రియలను సంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించొద్దని మృతుల కుటుంబాలపై చైనా ఒత్తిడి తెస్తున్నట్లు అమెరికా పేర్కొంది. సరిహద్దు ఘర్షణలో జరిగిన ప్రాణనష్టాన్ని ఇప్పటివరకు అంగీకరించని చైనా.. సైనికుల అంతిమ సంస్కార ప్రక్రియలనూ చేయొద్దని ఆదేశిస్తున్నట్లు.. అమెరికా నిఘా విభాగం‌ ఓ నివేదికలో పేర్కొంది. డ్రాగన్‌ సర్కార్‌ తన తప్పును కప్పిపుచ్చుకోడానికే... సైనికుల మరణాలను అంగీకరించటం లేదని తెలిపింది.

అయినవారిని కోల్పోయి ఎంతో బాధ అనుభవిస్తున్న కుటుంబాలను.. ప్రభుత్వ ఆదేశాలు మరింత కుంగదీస్తున్నాయని అభిప్రాయపడింది అమెరికా. సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా.. సైనికుల అవశేషాలను మాత్రమే ఖననం చేయాలని చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించినట్లు తెలిపింది.

35 మంది మృతి..

తూర్పు లద్ధాఖ్‌లోని గల్వాన్‌ లోయలో భారత్‌-చైనా సైనికుల ఘర్షణలో 35 మంది డ్రాగన్‌ సైనికులు మరణించినట్లు అమెరికా నిఘా విభాగం అంచనా వేసింది. సంప్రదాయ పద్ధతుల్లో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తే ఆ చిత్రాలు సోషల్‌ మీడియాలో వ్యాప్తి చెందే అవకాశం ఉందని చైనా భయపడుతున్నట్లు తెలిపింది.

భారత్​పై ప్రశంసలు..

భారత్‌ మాత్రం నిజాయితీగా 20 మంది సైనికులు అమరులైనట్లు ప్రకటించిందని గుర్తుచేసింది అమెరికా.

ABOUT THE AUTHOR

...view details