తెలంగాణ

telangana

ETV Bharat / international

ఉగ్రవాదులను రక్షించడం లేదు : చైనా - China

మసూద్​ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించకుండా చైనా అడ్డుకుంటోందన్న అమెరికా ఆరోపణలపై డ్రాగన్​ స్పందించింది. తాము ఉగ్రవాదులకు రక్షణ, ఆశ్రయం కల్పించట్లేదని ప్రకటించింది

మేము ఉగ్రవాదులను రక్షించడం లేదు : చైనా

By

Published : Mar 29, 2019, 11:16 PM IST

జైషే మహ్మద్​ ఉగ్రసంస్థ అధినేత మసూద్​ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించకుండా అడ్డుపడుతూ ముష్కరులను రక్షిస్తోందన్న అమెరికా ఆరోపణలపై స్పందించింది చైనా​.

స్వదేశంలోని ముస్లింలను వేధిస్తున్న చైనా... మసూద్​ను మాత్రం రక్షిస్తోందన్న విమర్శలపై పరోక్షంగా అమెరికాను ప్రశ్నించింది. తాము ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించట్లేదని బుకాయించింది.

"సాంకేతిక కారణాలతో చైనా ఉగ్రవాదులను రక్షిస్తోందని నిందిస్తున్నారు. అలాంటి కారణాలు చూపిన దేశాలన్నీ తీవ్రవాదులకు ఆశ్రయం కల్పించినట్లా? అలాగైతై ఏ దేశమైతే ఎక్కువ సాంకేతిక కారణాలు చూపుతుందో ఆ దేశమే ఉగ్రవాదులకు అతిపెద్ద ఆశ్రయం కల్పిస్తోందని మేము అనొచ్చా? "
-జెంగ్​ షాంగ్, చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి​​.

మసూద్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న భారత్​ ప్రతిపాదనకు చైనా నాలుగుసార్లు అసమ్మతి తెలిపిందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో తెలిపారు. స్వదేశంలో 10 లక్షల మందికి పైగా ముస్లింలను దేశంలో వేధిస్తున్న చైనా... హింసాత్మక ఉగ్రవాద ముఠాలను మాత్రం ఐరాస ఆంక్షల నుంచి రక్షిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details