తెలంగాణ

telangana

ETV Bharat / international

జవాన్ల మృతిపై మళ్లీ జవాబు దాటవేసిన చైనా - భారత్ చైనా సరిహద్దు వివాదం

గల్వాన్​ ఘర్షణలో చైనా మృతుల సంఖ్యపై ఆ దేశం మొదటి నుంచి గోప్యత పాటిస్తోంది. చైనా వైపు 40 మందికిపైగా మృతి చెందారని భారత మాజీ సైనికాధిపతి వీకే సింగ్​ వ్యాఖ్యలపై స్పందించేందుకు కూడా ఆ దేశం నిరాకరించింది. తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని చెప్పుకొస్తుంది.

galwan china vk singh
చైనా

By

Published : Jun 22, 2020, 3:34 PM IST

గల్వాన్​ ఘర్షణలో చైనా వైపు 40 మంది సైనికులు మరణించారన్న భారత మాజీ సైనికాధిపతి వీకే సింగ్​ వ్యాఖ్యలపై స్పందించేందుకు ఆ దేశం నిరాకరించింది. తమ వద్ద ఇందుకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని వెల్లడించింది.

చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్​ సోమవారం మీడియాతో మాట్లాడారు. "వివాద పరిష్కారానికి భారత్​, చైనా మధ్య దౌత్య, సైనిక సంప్రదింపులు జరుగుతున్నాయి." అని స్పష్టం చేశారు. వీకే సింగ్​ వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించగా తన వద్ద సమాచారం లేదని తప్పించుకున్నారు.

మొదటి నుంచీ గోప్యంగా..

గల్వాన్​ లోయలో జూన్​ 15న సైనికుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణపై చైనా ఎటువంటి వివరాలు వెల్లడించటం లేదు. మృతులు, గాయపడ్డవారి సంఖ్యపై మొదటి నుంచి గోప్యతను పాటిస్తోంది. అయితే చైనా వైపున కూడా మరణాలు సంభవించినట్లు ఆ దేశానికి చెందిన అధికారిక పత్రికలు వెల్లడించాయి.

భారత్ చైనా సరిహద్దుల్లో ప్రతిష్టంభనపై జనరల్ వీకే సింగ్ శనివారం ఓ వార్తా ఛానల్​తో మాట్లాడారు. "మనం 20 మంది సైనికులను కోల్పోయాం. చైనా వైపు ఇంతకు రెట్టింపు సంఖ్యలో చనిపోయారు." అని వ్యాఖ్యానించారు.

కొనసాగుతున్న చర్చలు..

తూర్పు లద్ధాఖ్​లో ఉద్రిక్తతలను తగ్గించే మార్గాలపై చర్చించడానికి మరోసారి లెఫ్టినెంట్​ జనరల్​ స్థాయి సమవేశం జరుపుతున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మొదటిసారిగా జూన్​ 6న జరిగిన భేటీలో ఇరు వర్గాలు సున్నితమైన ప్రాంతాల్లో వెనక్కుతగ్గాలని నిర్ణయించాయి. అయినప్పటికీ జూన్​ 15న చైనా వైఖరి తీవ్ర ఘర్షణలకు దారితీసి 20 మంది భారత సైనికులు అమరులయ్యారు.

ఇదీ చూడండి:భారత సైనికుల దెబ్బకు పరిగెత్తిన చైనా జవాన్లు!

ABOUT THE AUTHOR

...view details