తెలంగాణ

telangana

ETV Bharat / international

చీమల పార్సిల్​ సీజ్​ చేసిన కస్టమ్స్ అధికారులు! - చైనా

చైనా కస్టమ్స్ అధికారులు విదేశాల నుంచి దిగుమతి చేస్తున్న దాదాపు 1000 చీమలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 37 'బ్లాక్ అండ్ రెడ్ క్వీన్' చీమలు ఉన్నాయి. అసాధారణ జీవుల పెంపకం పట్ల పెరుగుతున్న క్రేజ్ వల్లే... ఇలా వాటి అక్రమ రవాణా జరుగుతోందని అధికారులు అంటున్నారు.

చీమల పార్సిల్​ సీజ్​

By

Published : Apr 30, 2019, 12:04 PM IST

కస్టమ్స్ అధికారులు ఏం సీజ్ చేస్తారు. బంగారమో, నగలో, వజ్రాలో, విలువైన లోహాలో, విగ్రహాలో, వస్తువులో ఇలాంటివి. కానీ చైనాలో కస్టమ్స్ అధికారులు చీమలను సీజ్ చేశారు. చీమలేంటి.. సీజ్ చేయటమేంటి అంటారా? అయితే.. ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.

చైనా కస్టమ్స్ అధికారులు వెయ్యి చీమలను స్వాధీనం చేసుకున్నారు. బ్రిటన్ నుంచి వచ్చిన ఓ పార్శిల్లో వీటిని గుర్తించారు.

టెస్ట్​ ట్యూబ్​లలో పోషక ద్రావణాలతో కలిపి వీటిని రవాణా చేస్తున్నట్లు హునాన్ రాష్ట్ర రాజధాని చాంగ్​షాలోని కస్టమ్స్ అధికారులు తెలిపారు. వీటిని పెంపుడు జంతువులుగా భావిస్తున్నట్లు చెప్పారు.

పార్సిల్లో 37 'బ్లాక్ అండ్ రెడ్ క్వీన్' చీమలు ఉన్నాయని తెలిపారు కస్టమ్స్ అధికారులు. వీటి శరీరం నిర్మాణం 1.4సెం.మీ పొడవు ఉందన్నారు. వీటితోపాటు భారీ సంఖ్యలో శ్రామిక చీమలు, గుడ్లు పార్సిల్లో ఉన్నాయని చెప్పారు.

చీమ 'ప్రేమ'...

ఇవన్నీ హార్వెస్టర్ చీమలుగా గుర్తించారు. చైనా పెంపుడు జంతు ప్రేమికుల్లో వీటి పట్ల ఇటీవల ఆదరణ విశేషంగా పెరుగుతోంది. ఇవి చూసేందుకు అందంగా కనిపిస్తాయి. త్వరగా పునరుత్పత్తి చేయగల్గటమే కాక వీటిని పెంచటం చాలా సులువు.

చైనాకు బతికున్న కీటకాలను మెయిల్ ద్వారా రవాణా చేయటం నిషేధం. ఇలాంటి స్థానికేతర చీమలు అక్రమంగా దేశంలోకి రవాణా చేస్తే... పర్యావరణం దెబ్బతినే ప్రమాదం ఉంటుందన్నది అధికారుల మాట. ఈ చీమల పార్సిల్​ను చట్టప్రకారం నాశనం చేస్తామని చెప్పారు.

చైనాలో వేగంగా వృద్ధిచెందుతున్న ఈ-కామర్స్ వ్యాపారం.. ఈ అసాధారణ పెంపుడు జంతువుల పట్ల వ్యామోహాన్ని మరింత పెంచుతోంది. పాములు, కీటకాలు, బల్లులు ఇలా అనేక రకాల జీవులు ఈ జాబితాలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ-కామర్స్ వల్ల విదేశీ జంతువులు, అంతరించిపోతున్న జీవుల అక్రమ రవాణా ఇటీవల పెరిగిపోయిందని ఆరోపణలు వస్తున్నాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details