China Covid Cases: కరోనా పుట్టినిల్లు అయిన చైనాలో మరోసారి కొవిడ్ విజృంభిస్తోంది. రెండేళ్లలోనే అత్యధిక స్థాయిలో అక్కడ రోజువారీ కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా దేశవ్యాప్తంగా దాదాపు 2 వేల మంది వైరస్ బారిన పడినట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ పేర్కొంది. చైనా రాజధాని బీజింగ్‌లో 20 మందికి వైరస్ నిర్ధరణ అయినట్లు తెలిపింది.
జిలిన్ ప్రావిన్స్‌లో అత్యధికంగా 1,412 కేసులు నమోదయ్యాయి. దీంతో గతవారమే జిలిన్ రాజధాని చాంగ్‌చున్‌లో లాక్డౌన్ విధించింది. చాంగ్చున్తోపాటు షాన్డాంగ్ ప్రావిన్స్‌లోని యూచెంగ్ నగరంలోనూ లాక్డౌన్ అమలు చేస్తోంది చైనా. యూచెంగ్లో మొత్తం జనాభా 5 లక్షలు.