యుద్ధ వాతావరణంతో కకావికలమైన అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా దళాల సత్వర ఉపసంహరణ తొందరపాటు చర్యగా చైనా అభివర్ణించింది. శాంతి ప్రక్రియకు, ప్రాంతీయ సుస్థిరతకు ఇది విఘాతమని.. ఐక్యరాజ్యసమితి తగిన పాత్ర పోషించక తప్పదని తెలిపింది.
ఈ విషయమై చైనా, పాకిస్థాన్ విదేశాంగ మంత్రులు వాంగ్ యీ, షా మహమూద్ ఖురేషీ నడుమ టెలిఫోన్ చర్చలు జరిగాయి. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి ముగుస్తుందనుకొన్న దళాల ఉపసంహరణను వెనువెంటనే పూర్తి చేయటంపై వాంగ్ ఆందోళన వ్యక్తం చేశారు.