తెలంగాణ

telangana

ETV Bharat / international

భారీ క్వారంటైన్ సెంటర్​ను నిర్మిస్తున్న చైనా

కొవిడ్ విజృంభణ దృష్ట్యా చైనా మరో భారీ క్వారంటైన్ కేంద్రాన్ని నిర్మిస్తోంది. మరోవైపు దక్షిణాఫ్రికాలో కరోనా విజృంభణ తగ్గకపోవడం వల్ల పాఠశాలల పునఃప్రారంభం మరోసారి వాయిదా పడింది.

china quaratine center
భారీ క్వారంటైన్ సెంటర్​ను నిర్మిస్తున్న చైనా

By

Published : Jan 15, 2021, 10:44 PM IST

ఉత్తరచైనాలోని షిజియాజ్ ​హువాంగ్ నగరంలో ఆ దేశం భారీ క్వారంటైన్ కేంద్రాన్ని నిర్మించనుంది. 3000 మందికి వసతి కల్పించేందుకు వీలుగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయి. చైనా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కొవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉన్నందున ఈ నిర్మాణం చేపడుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 9.37 కోట్లు దాటింది. యాక్టివ్​ కేసులు 24.7 లక్షలపైనే ఉన్నాయి. 6.69 కోట్లమంది కోలుకోగా ఇప్పటివరకు 20లక్షల మంది మృతి చెందారు.

జర్మనీలో విజృంభణ..

జర్మనీలో కరోనా కేసులు సంఖ్య 20లక్షలు చేరినట్లు శుక్రవారం వెల్లడించింది. కొత్తగా 22,368 కేసులు నమోదయ్యాయని స్పష్టం చేసింది.

దక్షిణాఫ్రికాలో..

దక్షిణాఫ్రికాలో కొత్తగా 18,500 కేసులు నమోదుకాగా, 712 మంది మృతి చెందారు. విజృంభణను పరిగణించి పాఠశాలల పునఃప్రారంభాన్ని ఫిబ్రవరి 15కు వాయిదా వేస్తున్నట్టు ఆ దేశ విద్యాశాఖ సహాయ మంత్రి శుక్రవారం ప్రకటించారు.

ఇదీ చదవండి :10 సెకన్లలోనే యాంటీబాడీల పరీక్ష

ABOUT THE AUTHOR

...view details