తూర్పు లద్దాక్ గల్వాన్ లోయ వద్ద భారత సైనికులపై రాళ్లు, ఇనుప రాడ్లతో చైనా బలగాలు చేసిన దాడిపై స్పందించడానికి ఆ దేశం నిరాకరించింది. అలాగే భారత్-చైనా సరిహద్దు వద్ద గల్వాన్ నదీ ప్రవాహాన్ని నిరోధిస్తూ నిర్మిస్తున్న డ్యామ్ విషయంపైనా స్పందించకుండా మౌనం వహిస్తోంది.
గల్వాన్ లోయలో భారత సైనికులతో జరిగిన ఘర్షణలో చైనా వైపు జరిగిన ప్రాణ నష్టం గురించి అడిగిన ప్రశ్నకు కూడా చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ మౌనం వహించారు. సరిహద్దు ఘర్షణకు భారత సైనికులే కారణమని .. వాస్తవాధీన రేఖ వెంబడి ఏకపక్ష ధోరణిలో పరిస్థితులను మార్చడానికి ప్రయత్నించారని లిజియన్ ఆరోపించారు. ఈ విషయంలో తమ సైనికుల తప్పేమీ లేదని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు.
శాంతి చర్చలకు సిద్ధం
బుధవారం.. భారత్-చైనా విదేశాంగ మంత్రులు జయ్శంకర్, వాంగ్ యీ ఫోన్లో చర్చలు జరిపిన విషయాన్ని లిజియన్ గుర్తుచేశారు. సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గించి, శాంతి పునరుద్ధరణ కోసం చర్చలు జరపాలని ఇరువురు మంత్రులు ఓ అంగీకారానికి వచ్చారని లిజియన్ వెల్లడించారు.
ఆ విషయం నాకు తెలియదు..