చైనాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొన్ని నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. సెంట్రల్ చైనాలోని అన్హుయి రాష్ట్రంలో చూహే నదిపై ఆనకట్టను పేల్చివేసి... వరద నీటిని విడుదల చేశారు అధికారులు. ఇలా చేయకపోతే ఆనకట్ట వెనుక భాగంలో ఉన్న గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదముందని తెలిపారు.
ఆనకట్టను పేల్చివేసి.. వరద నీరు విడుదల సామర్థ్యాన్ని మించి ప్రవహిస్తోన్న నది మిగిలిన చోట్ల... సైనికులు, సహాయక సిబ్బంది కలిసి కట్టల బలాలను పరీక్షిస్తున్నారు. బలహీనంగా ఉన్న ప్రదేశాల్లో ఇసుక సంచులు, రాళ్లు వేస్తున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
జియాంషీ రాష్ట్రంలో 15 గ్రామాలు, వ్యవసాయ క్షేత్రాలు జలమయం అయ్యాయి. 14 వేలమందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వరద ముప్పు ఎదుర్కొనేందుకు చర్యలు ఇసుక సంచులు సిద్ధం చేస్తున్న సైనికులు వరదల వల్ల ఇప్పటివరకు 150 మందికి పైగా మరణించారు. పలువురు గల్లంతయ్యారు. సుమారు 18లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 7 బిలియన్లు డాలర్లు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
ఇంటిని ఖాళీ చేస్తున్న ఓ కుటుంబం ఇదీ చూడండి:నేపాల్ ప్రధానికి ఊరట- వెనక్కి తగ్గిన ప్రచండ!