బ్రిక్స్-2021 శిఖరాగ్ర సదస్సు నిర్వహణ విషయంలో భారత్కు చైనా మద్దతు తెలిపింది. అభివృద్ధి చెందుతున్న ఐదు సభ్య దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసేందుకు భారత్తో కలిసి పని చేస్తామని చెప్పింది.
"బ్రిక్స్.. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల దేశాలతో కూడిన ఓ సహకార విధానం. ఇందులో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంచడానికి మేం కట్టుబడి ఉన్నాం. ఈ ఏడాది భారత్ ఆతిథ్యమివ్వడానికి మేము మద్దతు తెలుపుతున్నాం. సహకారాన్ని పెంచుకోవడం కోసం భారత్తో పాటు ఇతర సభ్య దేశాలతో కలిసి పనిచేస్తాం."
-వాంగ్ వెన్బిన్, చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి