తెలంగాణ

telangana

ETV Bharat / international

China astronaut: అంతరిక్షంలో 90 రోజులు.. క్షేమంగా భూమిమీదకు.. - భూ కక్ష్యలోని చైనా అంతరిక్ష కేంద్రం

రోదసిలో తమ అంతరిక్ష కేంద్రంలో(china astronauts space station) 90 రోజుల పాటు ఉన్న ముగ్గురు చైనా వ్యోమగాములు(China astronaut) సురక్షితంగా తిరిగి భూమికి చేరుకున్నారు. వారు ప్రయాణించిన అంతరిక్ష నౌక గోబీ ఎడారిలో దిగింది.

China astronauts
భూమికి చేరుకున్న చైనా వ్యోమగాములు

By

Published : Sep 17, 2021, 12:28 PM IST

భూ కక్ష్యలోని తమ అంతరిక్ష కేంద్రంలో(china astronauts space station) 90 రోజులు గడిపిన ముగ్గురు చైనా వ్యోమగాములు (China astronaut) తిరిగి భూమిమీదకు చేరుకున్నారు. నీ హైషెంగ్​, లియు బోమింగ్​, టాంగ్ హాంగ్బో ప్రయాణించిన షెంజౌ-12.. గోబీ ఎడారిలో ల్యాండ్​ అయింది. ఈ దృశ్యాలను ఆ దేశ అధికార ప్రసార సంస్థ- సీసీటీవీ చూపించింది.

భూమికి చేరుకున్న చైనా వ్యోమగాములు
భూమికి చేరుకున్న చైనా వ్యోమగాములు

ఈ వ్యోమగాములు ఇప్పటికే అంతరిక్షంలో సుదీర్ఘకాలం గడిపిన చైనీయులుగా (China astronaut) రికార్డు స్థాపించారు. రెండుసార్లు స్పేస్​వాక్​ (china astronauts space walk) నిర్వహించారు. అంతరిక్ష కేంద్రానికి 10 మీటర్లు పొడవైన యాంత్రిక హస్తాన్ని అమర్చారు. చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​తో వీడియో కాల్​ ద్వారా ముచ్చటించారు. తన రోదసి కేంద్రానికి మరో రెండు మాడ్యూళ్లను జోడించాలని డ్రాగన్​ భావిస్తోంది. పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాక దీని బరువు 66 టన్నులు ఉంటుంది.

ఇదీ చూడండి:భారత్​ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం.. చైనా వెన్నులో వణుకు!

ABOUT THE AUTHOR

...view details