అమెరికా సహా ప్రపంచ దేశాలు అఫ్గానిస్థాన్‌ను(afghanistan news) ఆదుకోవాలని చైనా విజ్ఞప్తి చేసింది. అఫ్గాన్‌కు తాము 31 మిలియన్ డాలర్లు విలువ చేసే సాయాన్ని అందిస్తామని ప్రకటించింది. అఫ్గాన్‌లో ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలకు అవకాశం ఇవ్వకుండా తాలిబన్లు (afghan taliban) కట్టుబడి ఉండాలని సూచించింది. అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. అఫ్గాన్‌లోని ప్రస్తుత పరిస్థితులకు అమెరికానే కారణమని.. ఆ దేశాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేసింది.
భద్రతాపరంగా అఫ్గాన్‌లో పరిస్థితులు మెరుగైతే ఆ దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ప్రకటించింది.
యూఎన్ ఆర్థిక సాయం..
అఫ్గానిస్థాన్‌కు ఐరాస.. 20 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. అఫ్గాన్‌కు ప్రపంచ దేశాలు అండగా నిలవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చింది. ప్రపంచ దేశాలు తమవంతుగా 606 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేసింది.
"అఫ్గాన్ ప్రజలకు ప్రస్తుతం సాయం అవసరం. దశాబ్దాల పాటు జరిగిన యుద్ధం తర్వాత ఇప్పుడు వాళ్లు అత్యంత దయనీయస్థితిలో ఉన్నారు. అంతర్జాతీయ సమాజం వారిని ఆదుకోవాల్సిన సమయం వచ్చింది. వీలైనంత వేగంగా వారికి అన్ని అవసరాలు తీర్చాలి. అక్కడి ప్రజలకు అన్ని విధాలుగా సాయపడేందుకు సంబంధిత అధికారులు అందరూ అంగీకరించారు. మా సిబ్బంది అక్కడ స్వేచ్ఛగా పనిచేసేందుకు ఎలాంటి భయాందోళనలు లేని వాతావరణాన్ని తాలిబన్ ప్రభుత్వం కల్పించాలి."
-ఆంటోనియో గుటెరస్, ఐరాస ప్రధాన కార్యదర్శి
అఫ్గాన్‌లో తాలిబన్ల వైఖరిపై యూఎన్ మండిపడింది. అఫ్గాన్‌లో తాలిబన్లు.. మాజీ భద్రతాధికారులపై వరుస హత్యలకు పాల్పడుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొంది. అమెరికాకు సహకరించిన అధికారులను, వారి కుటుంబాలను హింసిస్తున్నారని తెలిపింది. కొంతమందిని నిర్బంధించి విడుదల చేస్తుంటే.. మరికొందరిని మాత్రం హత్య చేస్తున్నారని మండిపడింది. ఇచ్చిన హామీలకు విరుద్ధంగా తాలిబన్లు.. మహిళల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించింది.
ఇదీ చూడండి :కొత్త ట్విస్ట్.. చైనా-పాక్‌తో కలిసి భారత యుద్ధ విన్యాసాలు!