తెలంగాణ

telangana

ETV Bharat / international

గజరాజులకు బఫెట్ విందు.. అతిథులకు కనువిందు..! - china

ప్రపంచ ఏనుగుల దినోత్సవం పురస్కరించుకొని చైనా ప్రభుత్వం యునాన్​ రాష్ట్రంలో 20 ఏనుగులకు బఫెట్​ విందు ఏర్పాటు చేసింది. గజరాజులు ఈ కార్యక్రమంలో ఆనందంగా విందు ఆరగించాయి.

గజరాజులకు బఫెట్ విందు ఏర్పాటుచేసిన చైనా

By

Published : Aug 13, 2019, 12:04 AM IST

Updated : Sep 26, 2019, 7:59 PM IST

గజరాజులకు బఫెట్ విందు.. అతిథులకు కనువిందు..!

'ప్రపంచ ఏనుగుల దినోత్సవం' సందర్భంగా దక్షిణ చైనా యునాన్​ రాష్ట్రంలో 20 గజరాజులకు విందు ఏర్పాటు చేసింది డ్రాగన్ ప్రభుత్వం. 55 మీటర్ల పెద్దదైన భోజన బల్లపై గజ రాజులకు ఇష్టమైన పళ్లు, కూరగాయలను ఉంచి విందుకు ఆహ్వానించారు చైనా అధికారులు. మూడు టన్నుల కూరగాయలు, క్యారెట్​, పుచ్చకాయలు, ఆపిల్ సహా పలు రకాల పళ్లను గజరాజులు ఇష్టంగా ఆరగించాయి.

1980లో చైనాలో వంద ఏనుగులు ఉండేవి. అక్కడి ప్రభుత్వం తీసుకున్న సంరక్షణ చర్యలతో గజరాజుల సంఖ్య ప్రస్తుతం 300కు చేరింది. అయితే ఒకప్పుడు ఏనుగుల జనాభా తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేసిన అధికారులు... ఇప్పుడు గజరాజులు చేసే అల్లరితో కాస్త ఇబ్బంది పడుతున్నామంటున్నారు.

ఇదీ చూడండి:కశ్మీర్​లో 'ఈద్' ప్రశాంతం... కానీ​ కళ తప్పింది!

Last Updated : Sep 26, 2019, 7:59 PM IST

ABOUT THE AUTHOR

...view details