భారత్‌తో సరిహద్దు ప్రాంతంలో(India China Border) తమ బలగాలకు కొత్త సారథిగా జనరల్ వాంగ్ హైజియాంగ్ను నియమించింది చైనా. పీఎల్ఏ(People's Liberation Army) వెస్టర్న్ థియేటర్ కమాండ్ బాధ్యతలను ఆయనకు అప్పగించింది. మరో నలుగురు సీనియర్ మిలిటరీ అధికారులకు కూడా సైన్యం అత్తున్నత హోదా జనరల్‌గా పదోన్నతి కల్పించింది. బిజింగ్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్(xi jinping) వీరికి నియామక పత్రాలు అందజేశారు. చైనా మిలిటరీ అధికారిక వెబ్సైట్ ఈ విషయాన్ని వెల్లడించింది.
షిన్జియాంగ్ ప్రాంతంతో పాటు టిబెట్ స్వయంపాలిత ప్రాంతాలు, భారత్‌తో సరిహద్దు ప్రాంతాల భద్రతను చైనా వెస్టర్న్ థియేటర్ కమాండ్ పర్యవేక్షిస్తుంది. చైనా ఆర్మీ పర్యవేక్షించే అతిపెద్ద భౌగోళిక ప్రాంతం కూడా ఇదే.