తెలంగాణ

telangana

By

Published : Jun 23, 2020, 5:33 AM IST

ETV Bharat / international

'గల్వాన్​ ఘర్షణ'లో మృతుల సంఖ్యపై నోరు విప్పిన చైనా

గల్వాన్​ లోయలో భారత్​తో చెలరేగిన హింసాత్మక ఘటనలో మృతిచెందిన, గాయపడిన సైనికుల సంఖ్యపై దాటవేస్తూ వస్తోన్న చైనా.. ఎట్టకేలకు నోరు విప్పింది. తమవైపు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 20కన్నా తక్కువగానే ఉంటారంటూ అంగీకరించింది. దాదాపు 70 మంది గాయపడినట్లు చెప్పుకొచ్చింది.

China admits less than 20 casualities
గల్వాన్​ ఘర్షణలో మృతుల సంఖ్యపై నోరు విప్పిన చైనా

భారత్​తో సరిహద్దులో నెలకొన్న ఘర్షణలో చనిపోయిన సైనికుల సంఖ్యపై ఎట్టకేలకు వివరాలు వెల్లడించింది చైనా. పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీ(పీఎల్​ఏ)కి 16 మంది సైనికుల మృతదేహాలను అప్పగించినట్లు భారత మీడియా నివేదించిన ఒక్క రోజు తర్వాత.. తొలిసారి ప్రాణాలు కోల్పోయిన సైనికుల సంఖ్యపై స్పష్టతనిచ్చింది. మృతిచెందిన వారి సంఖ్య 20 కన్నా తక్కువ ఉంటుందని, 70 మంది వరకు గాయపడ్డారని అంగీకరించింది.

ఈ మేరకు చైనా కమ్యూనిస్ట్​ పార్టీ అధికారిక మీడియా గ్లోబల్​ టైమ్స్​.. గల్వాన్​ లోయలో ఘర్షణ, మృతుల సంఖ్యపై బీజింగ్​ విశ్లేషకుల అభిప్రాయాలను ప్రచురించింది.

" ఉద్రిక్తతలను తగ్గించేందుకే చైనా.. తమవైపు మృతుల సంఖ్యను వెల్లడించకపోవటానికి గల కారణమని విశ్లేషకులు వెల్లడించారు. చైనా 20 కంటే తక్కువ ఉన్న సంఖ్యను విడుదల చేస్తే.. భారత ప్రభుత్వం మళ్లీ ఒత్తిడికి లోనవుతుంది. సాయుధ దళాలకు పూర్తి స్వేచ్ఛను తమ ప్రభుత్వం ఇచ్చిందని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం చెప్పారు. చైనా వైపు గల్వాన్​ లోయలో ఘర్షణతో చెలరేగిన ఉద్రిక్తతను తగ్గించేలా వ్యాఖ్యానించారు. చైనా మృతుల సంఖ్య భారత్​ కన్నా ఎక్కువగా ఉందని ఆ దేశ అధికారులు ఊహించటాన్ని చైనా విశ్లేషకులు, పరిశీలకులు తప్పుపట్టారు. స్వదేశంలో చైనా వ్యతిరేక భావనలను నియంత్రించకపోతే 1962 యుద్ధంలో కన్నా ఎక్కవగా అవమానపడాల్సి వస్తుందని హెచ్చరించారు. అతిపెద్ద మిత్ర దేశంతో కొత్త యుద్ధం చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు."

- గ్లోబల్​ టైమ్స్​, చైనా అధికారిక మీడియా

జాతీయవాదులుతో ప్రధాని మోదీ మాట్లాడుతున్నారని, తన దేశం చైనాతో మరింత వివాదం కలిగి ఉండటం మంచిది కాదని అర్థం చేసుకున్నారని చైనా పరిశీలకులు అభిప్రాయపడినట్లు గ్లోబల్​ టైమ్స్​ పేర్కొంది. అందుకే ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చింది.

ఇదీ చూడండి: రష్యాకు రాజ్​నాథ్​- అత్యవసర యుద్ధ సామగ్రి కోసమే!

ABOUT THE AUTHOR

...view details