తమ విద్యార్థుల వీసాలను ఉపసంహరించుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించటంపై చైనా ఆక్షేపించింది. ఈ నిర్ణయం పూర్తిగా రాజకీయ ప్రయోజనాలు, జాతి వివక్ష చర్యేనని ఆరోపించింది.
ఈ నిర్ణయాన్ని అమెరికా వెనక్కు తీసుకోవాలని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతిని ఝావో లిజియాన్ కోరారు. హాంకాంగ్ ప్రత్యేక హోదా రద్దుకు సంబంధించి ట్రంప్ ప్రకటనపైనా విమర్శలు చేశారు.
"అమెరికా తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి. అమెరికాలో చదువుకుంటోన్న చైనా విద్యార్థుల హక్కులు, ప్రయోజనాలను రక్షించాలి. హాంకాంగ్‌కు సంబంధించి అమెరికా ప్రకటన.. మార్కెట్ పోటీతత్వ సూత్రాన్ని ఉల్లంఘిస్తోంది. అమెరికా- చైనా సామాజిక సంబంధాలకు భారీ నష్టం కలిగిస్తుంది."
- ఝావో లిజియాన్, చైనా విదేశాంగ శాఖ