తెలంగాణ

telangana

'హాంగ్​కాంగ్​ నిరసనలపై డ్రాగన్ దుష్ప్రచారాలు'

హాంగ్​కాంగ్​ నిరసనలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చైనా నకిలీ సమాచారాన్ని ప్రచారం చేస్తోందని ట్విట్టర్​, ఫేస్​బుక్​ పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో చైనాకు సంబంధించిన 2 లక్షల ఖాతాలను తొలగించింది ట్విట్టర్.

By

Published : Aug 20, 2019, 10:41 AM IST

Published : Aug 20, 2019, 10:41 AM IST

Updated : Sep 27, 2019, 3:17 PM IST

'హాంగ్​కాంగ్​ నిరసనలకు వ్యతిరేకంగా చైనా ప్రచారాలు'

నేరస్థుల అప్పగింత బిల్లుకు వ్యతిరేకంగా హాంగ్​కాంగ్​లో జరుగుతున్న నిరసనలను అణిచి వేయటానికి చైనా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోందని సామాజిక మాధ్యమాల దిగ్గజాలు ట్విట్టర్, ఫేస్​బుక్ గుర్తించాయి. హాంగ్​కాంగ్​ నిరసనలను అణిచివేయడం, రాజకీయ మార్పు కోసం పిలుపు వంటి అంశాలపై చైనా చేస్తున్న దుష్ప్రచారాలను ట్వీట్టర్ బయటపెట్టింది. ఈ విషయానికి సంబంధించిన వివరాలు అన్ని సేకరించినట్టు తెలిపింది.

"ఇదొక ప్రభుత్వ మద్దతు ఆపరేషన్​ అని మా దర్యాప్తులో తేలింది. కొన్ని ఖాతాలు ఒక పద్ధతి ప్రకారం హాంగ్​కాంగ్​ నిరసనలకు వ్యతిరేకంగా సమాచారాలు పంపుతున్నాయి. వార్తా సంస్థలుగా నకిలీ ఖాతాలను తెరిచాయి. వాటి సందేశాలతో ప్రజలకు ఆకర్షించాయి. ఈ వ్యవహారంలో చైనాకు చెందిన అధికారులు ఉన్నట్లు గుర్తించాము."
-ట్విట్టర్​.

చైనాకు సంబంధించి 2 లక్షల ఖాతాలను తొలగించినట్లు ట్విట్టర్​ పేర్కొంది. ఫేస్​బుక్​ సైతం 7 పేజీలను, మూడు గ్రూపులు, ఐదు ఖాతాలను తొలగించినట్లు ఆ సంస్థ​కు చెందిన సైబర్​ సెక్యూరిటీ అధికారి గ్లిచర్​​ తెలిపారు.

నేరపూరిత కేసుల విచారణ నిమిత్తం తమ దేశ పౌరులను చైనాకు అప్పగించాలన్న బిల్లుకు వ్యతిరేకంగా హాంగ్​కాంగ్​ ప్రజలు కొన్ని వారాలుగా పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు.

ఇదీ చూడండి:నేడు రాజీవ్​గాంధీ జయంతి.. ప్రముఖుల ఘన నివాళి

Last Updated : Sep 27, 2019, 3:17 PM IST

ABOUT THE AUTHOR

...view details