తెలంగాణ

telangana

ETV Bharat / international

కొవిడ్​ చిన్నారుల నుంచి వారాలపాటు వైరస్​ వ్యాప్తి - కరోనా వ్యాప్తిలో చిన్నారుల కారణమన్న శాస్త్రవేత్తలు

మహమ్మారి వ్యాప్తిలో పిల్లల పాత్ర గురించి దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. వ్యాధికి సంబంధించి ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ కరోనా సోకిన చిన్నారులు వైరస్​ను వ్యాప్తి చేస్తున్నట్లు తెలిపారు. లక్షణాలు చాలా కాలం కిందటే తగ్గిపోయినా కూడా ఈ పరిస్థితి ఏర్పడుతుందని వెల్లడించారు.

Children with no COVID-19 symptoms may shed virus for weeks: Study
కొవిడ్​ చిన్నారుల నుంచి వారాలపాటు వైరస్​ వ్యాప్తి

By

Published : Aug 30, 2020, 10:50 AM IST

వ్యాధికి సంబంధించి ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ కొవిడ్​-19 సోకిన చిన్నారులు కరోనా వైరస్​ను వ్యాప్తి చేస్తారని దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు తెలిపారు. వారిలో లక్షణాలు చాలాకాలం కిందటే తగ్గిపోయిన సందర్భంలోనూ ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుందన్నారు. మహమ్మారి వ్యాప్తిలో పిల్లల పాత్ర గురించి కొత్త అంశాలను ఈ పరిశోధన వెలుగులోకి తెచ్చింది.

దక్షిణ కొరియాలోని సియోల్​ నేషనల్​ యూనివర్సిటీ కాలేజ్​ ఆఫ్​ మెడిసిన్​కు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. వ్యాధి లక్షణాల ఆధారంగా చిన్నారుల్లో కొవిడ్​-19 కేసులను గుర్తించడం కష్టమవుతోందని వారు తెలిపారు. ఊహించిన దాని కన్నా ఎక్కువ కాలం పాటు వారిలో వైరస్​కు సంబంధించిన జన్యు పదార్థామైన ఆర్​ఎన్​ఏ ఉంటోందని పేర్కొన్నారు. కరోనా సోకి దక్షిణ కొరియాలోని 22 ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 91 మంది పిల్లలపై వీరు పరిశోధన చేశారు. వీరిలో 22 శాతం మందిలో ఏ దశలోనూ వ్యాధి లక్షణాలు లేనప్పటికీ ఆ తర్వాత అవి తలెత్తాయి. 58 శాతం మందికి.. పరీక్ష చేసేటప్పటికీ రుగ్మతలు ఉన్నాయి.

ఈ చిన్నారులను సరాసరిన ప్రతి మూడు రోజులకోసారి పరీక్షించి చూశారు. తద్వారా వారి నుంచి కాలానుగుణంగా వెలువడుతున్న వైరస్​ స్థాయిని పరిశీలించారు. మూడు రోజుల నుంచి మూడువారాల పాటు వ్యాధి లక్షణాలు కొనసాగినట్లు తేల్చారు. 91 మందిలోనూ సరాసరిన రెండున్నర వారాల పాటు వైరస్​ జాడ కొనసాగింది. అయితే వ్యాధి లక్షణాలు లేని వారిలో ఐదో వంతు మందిలో లక్షణాలున్న వారిలో సగం మందిలో మూడో వారంలోనూ వైరస్​ ఉనికి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇదీ చూడండి:ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల 51 లక్షలు దాటిన కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details