తెలంగాణ

telangana

ETV Bharat / international

రేపిస్టులకు కొత్త శిక్ష- ఆ సామర్థ్యం ఖతం! - పాక్​ అత్యాచార చట్టాలు

అత్యాచార కేసు దోషులకు కఠిన శిక్షలు విధించేందుకు పాక్ ప్రభుత్వం సిద్ధమైంది. రేపిస్టులకు వీర్యహరణం చేసేలా రూపొందించిన ఆర్డినెన్స్​కు సూత్రప్రాయ అంగీకారం తెలిపింది.

Chemical castration of rapists given in-principle approval in Pakistan
అత్యాచార బాధితులకు అండగా పాక్​ కొత్త చట్టం

By

Published : Nov 25, 2020, 11:45 AM IST

Updated : Nov 25, 2020, 2:33 PM IST

అత్యాచార కేసు దోషులను లైంగికంగా అసమర్థులుగా చేసేందుకు పాకిస్థాన్​ ప్రభుత్వం సిద్ధమైంది. రేపిస్టులకు వైద్యపరమైన ప్రక్రియలో ఈ మేరకు కఠిన శిక్ష విధించాలని ప్రతిపాదిస్తూ రూపొందించిన ఆర్డినెన్సుకు ఇమ్రాన్​ ఖాన్​ ప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది.

పోలీసింగ్​లో మహిళల పాత్ర పెంచడం, అత్యాచార కేసుల విచారణ వేగవంతం చేయడం, సాక్షులకు రక్షణ కల్పించడం వంటి అంశాలతో పాకిస్థాన్​ న్యాయశాఖ ఈ ఆర్డినెన్స్ ముసాయిదాను రూపొందించింది. దీనికి మంత్రివర్గం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ఈ ఆర్డినెన్స్ త్వరలోనే బిల్లు రూపంలో పార్లమెంటుకు రానుంది.

"అత్యాచార దోషులను బహిరంగంగా ఉరి తీయాలని కొందరు మంత్రులు కేబినెట్ సమావేశంలో ప్రతిపాదించారు. అయితే ప్రస్తుతానికి లైంగికంగా అసమర్థులుగా మార్చే శిక్షతో మొదలుపెడదామని ప్రధాని ఇమ్రాన్​ ఖాన్ అన్నారు" అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

2018లో పంజాబ్​ రాష్ట్రం కసూర్​కు చెందిన ఏడేళ్ల బాలిక హత్యాచారం, ఇటీవల లోహోర్​లో జరిగిన సామూహిక అఘాయిత్యం... పాకిస్థాన్​లో అత్యాచార చట్టాలపై చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్​ సర్కార్ కఠిన చర్యలకు ఉపక్రమించింది.

ఇదీ చూడండి: అఫ్గాన్​లో​ బాంబు పేలుళ్లు.. 17 మంది మృతి

Last Updated : Nov 25, 2020, 2:33 PM IST

ABOUT THE AUTHOR

...view details