కరోనా వైరస్ నియంత్రణకు చైనా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌లు చాలా బలహీనంగా ఉన్నట్లు ఆ దేశమే స్వయంగా అంగీకరించింది. ఈ విషయాన్ని ఒప్పుకున్న వైరస్ నియంత్రణ అధికారులు.. ఆయా టీకాలను కలిపి వినియోగించటం ద్వారా సామర్థ్యం పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపారు. శనివారం చెంగ్దూ నగరంలో జరిగిన సమావేశంలో మాట్లాడిన చైనా వైరస్ నియంత్రణ కేంద్రాల డైరెక్టర్ గోవ్ ఫూ ఈ విషయం వెల్లడించారు.
మా వ్యాక్సిన్ల సామర్థ్యం తక్కువే: చైనా - అన్ని వ్యాక్సిన్లు కలిపి వాడాలని చూస్తున్న చైనా
తమ దేశ వ్యాక్సిన్లు నాసిరకంగా ఉన్నట్లు చైనా ఒప్పుకుంది. అన్ని టీకాలను కలిపి వినియోగించటం ద్వారా టీకా సామర్థ్యం పెంచాలని ప్రభుత్వ యోచిస్తున్నట్లు చైనా వైరస్ నియంత్రణ కేంద్రాల డైరెక్టర్ గోవ్ ఫూ చెప్పారు.
![మా వ్యాక్సిన్ల సామర్థ్యం తక్కువే: చైనా chaina on vaccine effective](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11362391-thumbnail-3x2-img.jpg)
వ్యాక్సిన్ సామర్థ్యంపై చైనా అధికారుల అభిప్రాయం
చైనా ఇప్పటికే తమ దేశంలో తయారైన వ్యాక్సిన్లను పలు దేశాలకు ఎగుమతి కూడా చేసింది. మిగతా దేశాల టీకాల సామర్థ్యంపై అనుమానాలు రేకెత్తించేలా తప్పుడు ప్రచారం సైతం చేస్తూ వచ్చింది. ఇప్పుడు మాత్రం తమ టీకాల సామర్థ్యం పెంచేందుకు వివిధ వ్యాక్సిన్లను కలిపి వినియోగించాలని చూస్తోంది. చైనాకు చెందిన సినోవాక్ సామర్థ్యం 50.4 శాతమేనని బ్రెజిల్ పరిశోధకులు గుర్తించారు. ఇదే సమయంలో ఫైజర్ వ్యాక్సిన్ 97 శాతం సామర్థ్యం కలిగి ఉన్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:వీలునామాల దిశగా చైనా యువత.. అందుకేనట!