అఫ్గానిస్తాన్ పరాహ్ రాష్ట్రంలో మంగళవారం జరిగిన ఆత్మాహుతి కారు బాంబు దాడిలో ముగ్గురు పౌరులు మరణించారు. వీరిలో ఓ చిన్నారి ఉంది. మరో 24 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. పోలీస్ స్టేషన్ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు పేర్కొంది.
దేశానికి ఉత్తరాన బగ్లాన్ రాష్ట్రంలో జరిగిన మరో రెండు ఘటనల్లో 10 మంది భద్రతా సిబ్బంది చనిపోయారని అధికారులు వెల్లడించారు. వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న సిబ్బందిపై కొందరు చొరబాటుదారులు దాడులు చేసినట్లు తెలిపారు. అయితే ఈ దాడులకు ఎవరూ కారణమన్నది ఇంకా తెలియరాలేదు.