భారత్ నుంచి ఎగుమతి అయిన ఐదు కంటైనర్ల గేదె మాంసాన్ని కంబోడియా ప్రభుత్వం సీజ్ చేసింది. మూడు కంటైనర్లలోని మాంసంలో కరోనా ఆనవాళ్లు ఉండడమే ఇందుకు కారణమని వెల్లడించింది.
కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఈ ఏడాది ఆరంభంలో భారత్ నుంచి మాంసం ఎగుమతుల్ని కంబోడియా నిషేధించింది. భారత్‌లో కేసులు కాస్త తగ్గిన నేపథ్యంలో ఇటీవలే ఆ ఆంక్షలు ఎత్తివేసింది. ఈ క్రమంలో ఓ ప్రైవేటు సంస్థ భారత్ నుంచి ఫ్రోజెన్ మీట్‌ను కంబోడియాకు సరఫరా చేసింది. అయితే ఇందులో కరోనా ఆనవాళ్లు ఉన్నట్లు అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. ఆ మూడు కంటైనర్లలోని సరకును వారం రోజుల తర్వాత నాశనం చేస్తామని ప్రకటించారు.