ఆస్ట్రేలియాలో నాలుగు నెలల క్రితం చెలరేగిన కార్చిచ్చు నానాటికీ ఉగ్రరూపం దాల్చుతోంది. వేడి గాలుల కారణంగా దావానలం వేగంగా వ్యాపిస్తోంది. న్యూసౌత్ వేల్స్లో 100కు పైగా వేర్వేరు చోట్ల ఎగిసిపడుతున్న మంటలతో వడగాలులు వీస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 7 రోజులపాటు అత్యవసర పరిస్థితి విధించింది ప్రభుత్వం. దేశ రాజధాని సిడ్నీని దట్టమైన పొగ కమ్మేసింది.
విపత్కర వాతావరణ పరిస్థితుల కారణంగా.. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు న్యూసౌత్ వేల్స్లో 2 సార్లు అత్యవసర పరిస్థితి విధించారు.
7.4 మైళ్ల ప్రాంతం ఆహుతి..
ఆస్ట్రేలియా కార్చిచ్చులో దేశవ్యాప్తంగా సుమారు 7.4 మైళ్ల మేర ప్రాంతం అగ్నికి ఆహుతయింది. ఆరుగురు మరణించారు. 800 ఇళ్లు దగ్ధమయ్యాయి. క్వీన్‌లాండ్ రాష్ట్రంలో 70 కార్చిచ్చు ప్రాంతాలను గుర్తించారు.