చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. గుయిజౌ రాష్ట్రంలోని అన్షున్ నగర సమీపంలో ఓ బస్సు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న సరస్సులోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 21 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలిచారు.
సరస్సులోకి దూసుకెళ్లిన బస్సు.. 21 మంది మృతి - china latest news
చైనాలోని గుయిజౌ రాష్ట్రంలో ఓ బస్సు అదుపుతప్పి సరస్సులోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
సరస్సులోకి దూసుకెళ్లిన బస్సు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది సీసీటీవీ ఛానల్. బస్సు అకస్మత్తుగా వేగం పెరిగి.. ఆరు లైన్ల రహదారి, దాని పక్కన ఉన్న కంచెను దాటుకుని సరస్సులోకి దూసుకెళ్లినట్లు వీడియోలో కనిపిస్తోంది.
ప్రయాణికుల్లో ఎక్కువ మంది ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉన్నట్లు అన్షున్ నగర అధికారులు తెలిపారు. జాతీయ విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష రాసేందుకు వెళుతున్నట్లు తెలిపారు.