తెలంగాణ

telangana

ETV Bharat / international

రోడ్డుపై భారీ గుంతలో పడిన బస్సు.. ఆరుగురు మృతి - చైనా రోడ్డు ప్రమాదం

చైనాలో జినింగ్ ప్రాంతంలో రహదారిపై ఏర్పడ్డ గుంత ఆరుగురి ప్రాణాలను తీసింది. ప్రయాణికులతో వెళుతున్న అకస్మాత్తుగా ఏర్పడిన గుంతలో పడిపోయింది.

రోడ్డుపై భారీ గుంతలో పడిన బస్సు
రోడ్డుపై భారీ గుంతలో పడిన బస్సు

By

Published : Jan 15, 2020, 12:23 AM IST

Updated : Jan 15, 2020, 5:53 AM IST

రోడ్డుపై భారీ గుంతలో పడిన బస్సు

చైనాలో రహదారిపై హఠాత్తుగా ఏర్పడ్డ గుంత ఆరుగురి ప్రాణాలను తీసింది. చైనాలోని జినింగ్‌ ప్రాంతంలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు.. రహదారిపై క్రమంగా కిందికి జారిపోయింది. క్షణాల వ్యవధిలో పెద్ద గుంత ఏర్పడి.. బస్సు అందులో మూడొంతుల భాగం కూరుకుపోయింది.

ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా, మరో నలుగురి జాడ తెలియకుండా పోయింది. గాయాలతో 16 మంది చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు.

Last Updated : Jan 15, 2020, 5:53 AM IST

ABOUT THE AUTHOR

...view details