రోజులు గడుస్తున్నా.. అఫ్గాన్‌లో పరిస్థితులు మారడం లేదు. ముఖ్యంగా.. ప్రాణభయంతో కాబుల్ విమానాశ్రయానికి(kabul airport) తరలివెళుతున్న అఫ్గాన్వాసుల సంఖ్య తగ్గడం లేదు. కాగా.. ఆదివారం విమానాశ్రయ ప్రాంగణంలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
Kabul Airport: విమానాశ్రయంలో తొక్కిసలాట- ఏడుగురు మృతి!
11:46 August 22
కాబుల్ విమానాశ్రయంలో తొక్కిసలాట- ఏడుగురు మృతి!
అఫ్గాన్.. తాలిబన్ల(taliban news) వశమైనప్పటి నుంచిఎన్నో హృదయవిదారక ఘటనలకు నిలయమైంది కాబుల్(kabul news) విమానాశ్రయం. తాలిబన్ల నుంచి తప్పించుకునేందుకు ఏ విమానం దొరికితే ఆ విమానాన్ని ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తొక్కిసలాటలు జరుగుతున్నాయి. తాజా ఘటనలో.. ఏడుగురు పౌరులు మరణించారని బ్రిటీష్ మిలిటరీ వెల్లడించింది. పలువురు గాయపడినట్టు పేర్కొంది.
"క్షేత్రస్థాయిలో పరిస్థితులు.. అదుపు చేయలేనంత దారుణంగా ఉన్నాయి. కానీ మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము," అని బ్రిటన్ రక్షణ మంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
మృదేహాలను తెల్లటి వస్త్రాలతో సైనికులు కప్పుతున్న దృశ్యాలు మీడియాకు కనిపించాయి. భయంతో హాహాకారాలు చేస్తున్న ప్రజలను జవాన్లు శాంతిపజేస్తున్నారు. పళ్లరసాలు అందిస్తున్నారు. కానీ రోజురోజుకు ఉద్ధృతి పెరుగుతూనే, ఇలా అయితే ముందు ముందు మరింత కష్టతరం అవుతుందని అధికారులు అంటున్నారు.
ఇవీ చూడండి:-'అఫ్గాన్‌లో చిక్కుకున్న అమెరికా పౌరులకు ఐఎస్ ముప్పు'