తాలిబన్ల చెర(Afghan Taliban) నుంచి బయటపడేందుకు కాబుల్ విమానాశ్రయానికి(Kabul airport) భారీగా ప్రజలు తరలివస్తున్న వేళ.. ఎయిర్పోర్ట్ ప్రాంతంలో భారీ ఉగ్రదాడికి కుట్ర(Terror Attack) జరుగుతోందా? అంటే అవుననే అంటున్నాయి వేర్వేరు దేశాలు. కాబుల్ విమానాశ్రయం సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది బ్రిటన్ ప్రభుత్వం. అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవాలని సూచించింది. హెచ్చరికలను బేఖాతరు చేస్తూ వేలాది మంది ఎయిర్‌పోర్ట్‌కు తరలివస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది.
తమ పౌరులు కాబుల్ విమానాశ్రయం నుంచి దూరంగా వెళ్లిపోవాలని.. బ్రిటన్‌తో పాటు అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌తో సంబంధాలున్న ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరికలు చేసిన తర్వాత.. పలు దేశాలు తమ పౌరులను అప్రమత్తం చేస్తున్నాయి.
విమానాశ్రయం వద్ద భారీ దాడికి కుట్ర జరుగుతోందని విశ్వసనీయవర్గాల నుంచి సమాచారం అందినట్లు బ్రిటీష్ రక్షణ మంత్రి జేమ్స్ హీపీ ఓ వార్తా సంస్థకు తెలిపారు.
ఉగ్రదాడిపై ఆస్ట్రేలియా హెచ్చరిక..