ఈ ఏడాది సెప్టెంబరులో రష్యాలో బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన సమాాచారాన్ని సభ్య దేశాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాయని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ యీ తెలిపారు. సమావేశంలో చైనా పాల్గొంటుందని సూచన ప్రాయంగా తెలిపారు.
'రష్యా అధ్యక్షతన సెప్టెంబరులో జరిగే బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి చైనా పూర్తి మద్దతునిస్తుంది. రష్యా నాయకత్వంలో నూతన పురోగతి దిశగా బ్రిక్స్ దేశాలు ముందుకు సాగుతాయని ఆశిస్తున్నాం. ఈసారి అంతర్జాతీయ పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి. ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సవాళ్ల గురించి సభ్య దేశాలతో చర్చించేందుకు చైనా ఎదురుచూస్తోంది' అని వాంగ్ యీ అన్నారు.