తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం

బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రులు మంగళవారం సమావేశమవనున్నారు. కరోనాపై పోరులో పరస్పర సహకారంపై చర్చించనున్నారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్​ ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు

BRICS external ministers meet
బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం

By

Published : Jun 1, 2021, 5:22 AM IST

బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రులు వీడియో కాన్ఫరెన్స్​లో మంగళవారం సమావేశమవనున్నారు. కరోనా వైరస్​ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి దేశాల మధ్య పరస్పర సహకారం పెంచాలనే అంశంపై చర్చించే అవకాశం ఉంది.

ఉగ్రవాదంపై పోరుతో పాటు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించనున్నారు. సమకాలీన పరిస్థితులకు తగ్గట్టుగా వాటి పరిష్కరాలపై మాట్లాడనున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

భారత విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్​ ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. బ్రెజిల్​, రష్యా, భారత్​, చైనా, దక్షిణా ఆఫ్రికాలు బ్రిక్స్​లో సభ్యదేశాలుగా ఉన్నాయి.

ఇదీ చదవండి:550 మిలియన్ డాలర్లు ఇస్తేనే ఆ నౌక రిలీజ్!

ABOUT THE AUTHOR

...view details