తెలంగాణ

telangana

ETV Bharat / international

అఫ్గాన్​-తాలిబన్​ చర్చల్లో పురోగతి!

అఫ్గాన్​-తాలిబన్​ల మధ్య చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఇరు వర్గాలు ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది. ఫిబ్రవరి 29 అమెరికా ఒప్పందం, ఐక్యరాజ్యసమితి ఒప్పందాలు, అఫ్గాన్ ప్రజల ఆకాంక్ష తదితర అంశాలపై తదుపరి చర్చల్లో విశ్లేషించనున్నట్లు సమాచారం.

breakthrough-reported-in-afghan-taliban-talks-in-doha
దశాబ్దాల అఫ్గాన్​-తాలిబన్ల చర్చల్లో పురోగతి

By

Published : Nov 23, 2020, 6:33 PM IST

దశాబ్దాలుగా అఫ్గానిస్థాన్​ ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య కొనసాగుతున్న చర్చల్లో ముందడుగు పడినట్లు సమాచారం. ఫిబ్రవరి 29 అమెరికా ఒప్పందం, ఐక్యరాజ్యసమితి ఒప్పందాలపై తదుపరి చర్చల్లో పరిష్కారం లభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఇదే విషయంపై ప్రభుత్వ ప్రతినిధి మహమ్మద్​ మస్సూమ్​ స్టానిక్​జాయ్​, సలహాదారు సలాం రహిమిలు అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్​ ఘనీతో భేటీ అయినట్లు స్థానిక టీవీ ఛానెల్​ పేర్కొంది. చర్చల్లో భాగంగా ఇరు వర్గాల ప్రతినిధులు నవంబరు 21న దోహాలో అమెరికా విదేశాంగమంత్రి మైక్​ పాంపియోను కలిశారు. అఫ్గానిస్థాన్​లో హింసను అరికట్టి శాంతిని నెలకొల్పేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

దోహా ఒప్పందాన్ని అమలు చేయాలని తాలిబన్లు డిమాండ్ చేశారు. ఐక్యరాజ్యసమితి బ్లాక్​లిస్ట్ నుంచి వారి పేర్లను తొలగించాలన్నారు. వారి ఖైదీలను విడుదల చేయాలని తెలిపారు. మిగతా ఖైదీలను విడుదల చేయటం, బ్లాక్​లిస్ట్​ విధానాన్ని రద్దు చేయటంపై చర్చలు జరిపామని తాలిబన్ల ప్రతినిధి మహమ్మద్​ నయిమ్ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details