ఇరాక్ కర్బాలా ప్రాంతంలో భారీ పెలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 12 మంది మృతి చెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
దక్షిణ కర్బాలలోని అల్-హిల్లా నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైనిక తనిఖీ కేంద్ర వద్ద బస్సులో పేలుడు సంభవించింది. పేలుడుకు ముందు, ఓ ప్రయాణికుడు బస్సు నుంచి దిగిపోయినట్లు అధికారులు గుర్తించారు. అతను పేలుడు పదార్థాలతో ఉన్న బ్యాగును బస్సులోని ఓ సీటు కింద ఉంచి రిమోట్ సాయంతో పేల్చినట్లు అనుమానిస్తున్నారు.