Bomb threat to Malaysia airline: బాంబు బెదిరింపులతో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఎయిర్‌పోర్ట్‌లో కలకలం రేగింది. మలేసియా ఎయిర్‌లైన్‌కు చెందిన విమానంలో బాంబు పెట్టినట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో హుటాహుటిన అగ్నిమాపక యంత్రాలను, కమాండోలను రంగంలోకి దించి తనిఖీలు చేపట్టారు.
Dhaka airport Bomb threat:
బుధవారం రాత్రి 9.38 గంటలకు ఎంహెచ్-196 విమానం కౌలాలంపూర్ నుంచి హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఇందులో 135 మంది ప్రయాణికులు ఉన్నారు. బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు. విమానం ల్యాండ్ అవ్వగానే.. దాన్ని ట్యాక్సీవే వైపు మళ్లించారు. బంగ్లాదేశ్ వాయుసేనకు చెందిన బాంబ్ స్క్వాడ్.. ప్రయాణికులను దించేసి విమానాన్ని పూర్తిగా తనిఖీ చేసింది. అయితే, విమానంలో కానీ, ప్రయాణికుల లగేజీలో కానీ తమకు పేలుడు పదార్థాలేవీ లభించలేదని స్పష్టం చేసింది.
Dhaka airport bomb threat: