పాకిస్థాన్లోని బలోచిస్థాన్ రాష్ట్రం(అఫ్గానిస్థాన్ సరిహద్దు)లో మంగళవారం బాంబు పేలుడు సంభవించింది. ప్రధాన సరిహద్దు పట్టణం చమన్లోని భద్రతా దళాల కార్యాలయం వెలుపల జరిగిన ఈ ఘటనలో.. నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మందికి గాయాలయ్యాయి.
అయితే.. ఈ దాడికి ఎవరూ తక్షణ బాధ్యత వహించలేదు. రక్షణ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి.. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్టు స్థానిక పోలీస్ అధికారి జాకౌల్లా దుర్రానీ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసినట్టు వెల్లడించారు.