అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లో వరుస బాంబు దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా జాతీయ మిలిటరీ ఆస్పత్రికి సమీపంలో రెండు చోట్ల బాంబు దాడులు జరిగినట్లు సమాచారం. ఈ పేలుళ్లలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 16మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులకు పాల్పడినట్లు.. తాలిబన్ అధికార ప్రతినిధి బిలాల్ కరిమీ తెలిపారు. వరుస బాంబు దాడుల నేపథ్యంలో ప్రజలు భయంతో.. కాబుల్ నుంచి వేరే ప్రాంతాలకు పరుగులు తీశారు.