వరుస పేలుళ్లు అఫ్గానిస్థాన్లో తీవ్ర విషాదం నింపాయి. ఈ విధ్వంస ఘటనల్లో ఇప్పటి వరకు 16మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చాలా మంది మహిళలు, యువతులు ఉన్నారు.
వివాహానికి వెళుతుండగా ఓ వాహనంపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 15మంది మరణించారు. వీరిలో ఆరుగురు మహిళలు, ఆరుగురు యువతులు, ఇద్దరు శిశువులని అధికారులు తెలిపారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. ఉత్తర కుందుజ్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.