అఫ్గానిస్థాన్ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. ఈసారి ఏకంగా ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ సభలోనే పేలుళ్లకు పాల్పడ్డారు దుండగులు. ఉత్తర పర్వాన్ రాష్ట్రంలో జరిగిన ఈ మారణకాండలో 24 మంది మరణించారు.
సభ జరుగుతున్న సమయంలో ప్రవేశ ద్వారం వద్ద పేలుడు సంభవించింది. ఓ పోలీస్ వాహనానికి ఈ బాంబును అమర్చినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఘనీ అక్కడే ఉన్నారనీ, అయితే ఆయన క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు.