తెలంగాణ

telangana

ETV Bharat / international

చీఫ్​ మెడికల్​ అడ్వైజర్​గా ఫౌచీ కొనసాగింపు: బైడెన్​ - డాక్టర్​ ఆంథోనీ ఫౌచీ

అమెరికా ప్రధాన ఆరోగ్య సలహాదారు(చీఫ్​ మెడికల్​ అడ్వైజర్​)గా ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు డాక్టర్​ ఆంథోనీ ఫౌచీని కొనసాగిస్తున్నట్లు చెప్పారు అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్​. తన కొవిడ్​-19 సలహా బృందంలోనూ సభ్యులుగా ఉంటారని చెప్పారు.

anthony fauci
డాక్టర్​ ఆంథోనీ ఫౌచీ

By

Published : Dec 4, 2020, 10:21 AM IST

Updated : Dec 4, 2020, 11:24 AM IST

ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు డాక్టర్​ ఆంథోని ఫౌచీని అగ్రరాజ్య ప్రధాన ఆరోగ్య సలహాదారుగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్​. అలాగే.. కొవిడ్​-19 సలహా బృందంలో సభ్యులుగా ఉంటారని చెప్పారు.

ఓ మీడియా ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వెల్లడించారు బైడెన్​. ఆంథోనీ ఫౌచీతో మాట్లాడినట్లు తెలిపారు. ఏదైనా కరోనా వ్యాక్సిన్​పై, వైరస్​ను ఎదుర్కోవటానికి ఆర్థిక వ్యవస్థను మూసివేయాల్సిన అవసరం లేదని ప్రజల్లో విశ్వాసం కలిగించాల్సిన అవసరంపై చర్చించినట్లు చెప్పారు.

టీకా భద్రతను నిరూపించేందుకు తాను బహిరంగంగా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు బైడెన్​. అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు ఎదురుచూస్తున్నానని తెలిపారు.

100 రోజులు మాస్క్​ ధరించాలని కొరతా..

అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలుత మాస్క్​ ధరించటంపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు జో బైడెన్​. " పదవీ బాధ్యతలు చేపట్టిన తొలిరోజే.. 100 రోజుల పాటు మాస్క్​ ధరించాలని కోరబోతున్నా. కేవలం వంద రోజులే, ఎప్పటికీ కాదు. దాంతో కేసుల్లో గణనీయమైన తగ్గుదలను చూస్తాం." అని పేర్కొన్నారు బైడెన్​.

ఇదీ చూడండి: 'వచ్చే నెలలోనే అమెరికన్లకు కరోనా వ్యాక్సిన్​'

Last Updated : Dec 4, 2020, 11:24 AM IST

ABOUT THE AUTHOR

...view details