కొవిడ్-19 టీకాలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తూ..భారత్ తన ఉదారతను చాటుకుంటోంది. ఈ క్లిష్ట సమయంలో మనదేశం చూపుతున్న చొరవకు అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ వరసలో భూటాన్‌కు చెందిన ఓ చిన్నారి కూడా చేరింది. కరోనా టీకాలు తమ దేశానికి పంపినందుకు కృతజ్ఞతగా ముద్దుముద్దు మాటలతో భారత్‌కు 'షుక్రియా' చెప్పింది. ఆ దేశంలో భారత్ రాయబారిగా ఉన్న రుచిరా కాంబోజ్ షేర్ చేసిన వీడియో ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది.
'షుక్రియా భారత్'.. చిన్నారి ముద్దుగొల్పే మాటలు - ఖెన్రాబ్ ఈద్జిన్ సెల్డెన్
టీకా పంపిణీ చేస్తున్నందుకు అంతర్జాతీయంగా భారత్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. తమ దేశానికి టీకా సరఫరా చేసినందకుగానూ ముద్దుముద్దు మాటలతో.. భూటాన్‌కు చెందిన ఓ చిన్నారి భారత్‌కు కృతజ్ఞతలు తెలిపింది.
ఆ వీడియోలో కనిపించిన బాలిక పేరు ఖెన్రాబ్ ఈద్జిన్ సెల్డెన్. ఆ పాప ఒక చైల్డ్ ఆర్టిస్ట్. ఆ వీడియోలో ఖెన్రాబ్ మొదట తనను తాను పరిచయం చేసుకుంటుంది. తరవాత పొరుగున ఉన్న తమ దేశం పట్ల భారత్ చూపిన ఉదారతకు కృతజ్ఞతలు తెలియజేస్తుంది. చివరగా షుక్రియా భారత్ అంటూ తన అభిమానాన్ని చూపిస్తుంది. ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఆ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ మాటలు, ఎక్స్‌ప్రెషన్స్..సో క్యూట్ అంటూ వారు తెగ ముచ్చటపడిపోతున్నారు.
ఇదీ చదవండి:ప్రధాని మోదీ, భారత ప్రజలకు కృతజ్ఞతలు: గేల్